Header Banner

పవన్‌పై విమర్శలు మాని క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు! జగన్‌కు జనసేన వార్నింగ్!

  Thu Mar 06, 2025 19:55        Politics

ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఏపీలో సంచలనంగా మారాయి. జగన్ చేసిన ఈ కామెంట్స్‌పై జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా జనశ్రేణులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్‌పై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ద్వారకాతిరుమల ఎంపీడీవో కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన చేశారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


'అర డజనుకు ఎక్కువ డజనుకు తక్కువ, ఈడీకి ఎక్కువ సీబీఐకి తక్కువ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద నుండి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. మాజీ సీఎం జగన్ తన పద్ధతి మార్చుకోవాలని జనసైన నేతలు హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్‌ను విమర్శించే స్థాయి జగన్‌కు లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టారో మర్చిపోయారా జగన్ అంటూ ప్రశ్నించారు. తండ్రి, బాబాయి చావును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్ మా అధినేతను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే జనసేన శ్రేణులు సహించబోరని నరసింహ మూర్తి ద్వారకాతిరుమల మండల జనసేన అధ్యక్షుడు హెచ్చరించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #janasena #fire #ycp #todaynews #flashnews #latestnews